Kurnool: కర్నూలులో కమిషనర్ ఓబులేసు సుడిగాలి పర్యటన!
Kurnool: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి కర్నూలు నగరపాలక సంస్థకు రానున్న ఎలక్ట్రిక్ ఆటోల పార్కింగ్, చార్జింగ్ స్టేషన్ల కోసం 3 ప్రాంతాలను ఎంపిక
Kurnool: కర్నూలులో కమిషనర్ ఓబులేసు సుడిగాలి పర్యటన!
కర్నూలు: త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి నగరపాలక సంస్థకు రానున్న ఎలక్ట్రిక్ ఆటోల పార్కింగ్ కోసం జొహరాపురం రోడ్డు, వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్ట్ వెనుక, శ్రీనివాస నగర్‌లో త్రిగుణ హోటల్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
గురువారం ఆయన ఆయా ప్రదేశాలను పరిశీలించి, అక్కడ చార్జింగ్ పాయింట్లు, ప్రహరీ గోడ, గేటు తదితర మౌలిక సదుపాయాల పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గాయత్రి ఎస్టేట్, బిర్లా కాంపౌండ్, బుధవారపేట ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కూడా పరిశీలించారు.