Nandyala: కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. నంద్యాల సీఐ
Nandyala: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయని నంద్యాల త్రీటౌన్ సీఐ వేణుగోపాల్ హెచ్చరించారు.
Nandyala: కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. నంద్యాల సీఐ
Nandyala: నంద్యాల జిల్లా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలను కష్టపడి పెంచి పెద్దలు చేస్తారు…కానీ అదే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే… చట్టం ఊరుకోదు.తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై కఠిన చర్యలు తప్పవని నంద్యాల 3 టౌన్ సీఐ వేణుగోపాల్ హెచ్చరించారు.
నంద్యాలలో తల్లిదండ్రుల సంక్షేమం పై కీలక వ్యాఖ్యలు చేశారు 3 టౌన్ సీఐ వేణుగోపాల్.కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం కేవలం మానవత్వానికి విరుద్ధమే కాదు చట్టరీత్యా కూడా నేరమని స్పష్టం చేశారు.
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007 ప్రకారం…తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి సంరక్షణ బాధ్యతను విస్మరించే పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే…విచారణ అనంతరం నిర్లక్ష్యం చేసిన పిల్లలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాంటి వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉందన్నారు.“పిల్లలు తమ కన్న తల్లిదండ్రులను ప్రేమతో, బాధ్యతతో చూసుకోవాలి. వారిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు” సీఐ వేణుగోపాల్
పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగులో అండగా నిలిచే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయొద్దు…వారిని ప్రేమగా చూసుకోవడం బాధ్యత మాత్రమే కాదు… ప్రతి పిల్లవాడి ధర్మం కూడా.