Kurnool: ప్రభుత్వ నిబంధనలు గాలికి.. కర్నూలులో ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీ!
Kurnool: కర్నూలు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తమను వేధిస్తోందని బాధితుడు నగేష్ డి.ఇ.ఓ కి ఫిర్యాదు చేశారు.
Kurnool: ప్రభుత్వ నిబంధనలు గాలికి.. కర్నూలులో ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీ!
కర్నూలు: ఫీజుల పేరుతో హింసిస్తున్న శ్రీ చైతన్య స్కూలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిఇఓ కి బాధిత విద్యార్థి తండ్రి నగేష్ వినతి పత్రం అందించారు. వై.హర్షనందు 3వ తరగతి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, భాస్కర్ నగర్ (డైస్ కోడ్: 21344) లో చదువుతున్నా విద్యార్థితో ఇప్పటి వరకు ఫీజు 14500/- మరియు బుక్స్, డిజిటల్ కంటెంటే(వద్దు అన్న బలవంతంగా) 8036/- కట్టించుకున్నారు. గత ప్రభుత్వం విడతల చేసిన ప్రవేట్ పాఠశాలల ఫీజు స్ట్రక్చర్ లో మున్సిపాలిటీలలో 5వ తరగతి లోపు విద్యార్థులకు గరిష్టంగా 12000/- కట్టించుకోవాలని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం RTE విద్యార్థుల సమస్య వచ్చిన సందర్భంగా ఐదు విభాగాలుగా విభజించి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న స్కూళ్లలో 14500/- కట్టాలని ప్రభుత్వము నిర్ణయించింది.
ఆ విధంగా నేను ఇప్పటికే 14500/- చెల్లించాను. అయినా సరే పాఠశాల యాజమాన్యం బుక్స్ కి కట్టిన 8036 కాదు అని ఫీజు మాత్రమే 26000/- కట్టాలని మానసికంగా హింసిస్తుంది. పాఠశాల యాజమాన్యం ఆర్టిఇ విద్యార్థులకు వేరు ఫీజు ఇతర విద్యార్థులకు వేరే ఫీజు అని చెబుతుంది. అంటే ప్రభుత్వం కట్టాల్సి వస్తే ఇలా ఒక ఫీజు నిర్ణయించి తల్లిదండ్రులు కట్టాల్సి వస్తే ఎంతైనా వసూలు చేసుకోండని ప్రభుత్వం చెబుతుందా అని అడిగారు. డీఈఓ కలగజేసుకొని ప్రభుత్వము నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్న, విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా హింసిస్తున్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, భాస్కర్ నగర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఓ కి నగేష్ వినతి పత్రం అందించారు.