Kurnool: కర్నూలు కలెక్టరేట్ ముందు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ధర్నా
Kurnool: పత్తికొండలో ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసిన సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన.
Kurnool: కర్నూలు కలెక్టరేట్ ముందు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ధర్నా
కర్నూలు: పత్తికొండలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా బలవంతంగా అరెస్టు చేసి అక్రమంగా బైండోవర్ కేసు నమోదు చేసిన సీఐ జయన్న సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు అభి నాగరాజ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, నగర కార్యదర్శి బిసన్న, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి అశోక్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తికొండ నియోజకవర్గానికి కేటాయించిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను
పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయకుండా స్థానిక ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు తన స్వార్థం కోసం ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని మారుమూల గ్రామమైన కంబాలపాడుకు తరలించకపోవడానికి నివసిస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న నాయకులను సిఐ జయన్న దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా ఈడ్చడమే కాకుండా బూట్ కాల్ తో తంతా నట్టు దూషించడమే కాకుండా వారిని అరెస్టు చేసి అక్రమంగా వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం
దుర్మార్గమని వారు మండిపడ్డారు సీఐ జయన్న ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదా అధికార పార్టీ నాయకుల కోసం పని చేస్తున్నారా అని వారు ప్రశ్నించారు పత్తికొండ నియోజకవర్గం రెవిన్యూ డివిజన్ అయినప్పటికీ బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు బీసీ హాస్టల్ లేకపోవడం బీసీలమని చెప్పుకుంటూ ఎమ్మెల్యేలుగా అధికారాన్ని చలాయిస్తున్న ఎమ్మెల్యే నిర్లక్ష్యం కాదా అని వారి ప్రశ్నించారు కంబాలపాడు గ్రామంలో ఇప్పటికే అంబేద్కర్ గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నప్పటికీ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కూడా అక్కడికే తీసుకెళ్లడం పత్తికొండ ప్రజలకు అన్యాయం చేయడమే అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తే పత్తికొండ తో పాటు తుగ్గలి మద్దికేర దేవనకొండ ఆలూరు ఆస్పరి అన్ని మండలాలకు అనుకూలంగా ఉంటుందని కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని తప్ప తన సొంత ప్రయోజనాల కోసం కాదని వారు విమర్శించారు.
అధికారం ఉంది కదా అని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే విద్యార్థి యువజన సంఘం నాయకులను అరెస్టు చేయిస్తాం అక్రమ కేసులు పెడతామంటే విద్యాసంస్థలను ఉద్యమ నిలయాలుగా మార్చి అధికార మతం దించుతామని వారు హెచ్చరించారు, విద్యార్థుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసేయడమే కాకుండా సిఐ జయన్న ను సస్పెండ్ చేసేంతవరకు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ గా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నగర నాయకులు చంటి, అఖిల్, శ్రీకాంతు, హుస్సేన్, కుమారు, కాసిం, సాయి, నాని, చిన్న, దేవా అర్జున్, తదితరులు పాల్గొన్నారు.