Kurnool: కర్నూలు జిల్లాలో 77 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Kurnool: కర్నూలు జిల్లా పరిధిలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 13 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 64 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
Kurnool: కర్నూలు జిల్లాలో 77 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
కర్నూలు: జిల్లా పరిధి లో 9 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని 13 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 64 అంగన్వాడీ ఆయాలు నియమేకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు 10 వ తరగతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన బోర్డు ల ద్వారా పాస్ కావలెను మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు 7 వ తరగతిపాసు ఉండవలెను. పెళ్లి కావలెను. వయస్సు 1.7.2026 నాటికి 21 సం. నిండి 35 సం.లోపు అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను.
నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. ఖాళీల వివరాలకు సంభందిత సి.డి.పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు. అభ్యర్థులకు తెలియచేయుట ఏమనగా ఈ ఖాళీల లో కొన్ని గౌరవనీయ హై కోర్టు నందు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ పోస్టుల నందు నియమించిన అభ్యర్థులు వారి నియమీకము భవిష్యత్తులో వెలువబడు కోర్టు ఉత్తర్వుల పై ఆధార పడి ఉంటాయి. మరిన్ని విషయాలకు, పూర్తి నోటిఫికేషన్ కొరకు సంబంధిత సి. డి.పి. ఒ / జిల్లా మహీళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికరీత అధికారణి, కర్నూల్ వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అటెస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి.డి.పి.ఒ, ఐ.సి.డి. యస్ కార్యాలయము లో 05.08.2026 నుండి 13.08.2026 కార్యాలయము పనిదినాలలో మరియు కార్యాలయము సమయం లో సమర్పించవలెను.
పి. విజయ, ఎ. సిరి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి, కర్నూలు, జిల్లా కలెక్టర్ / చైర్మన్ జిల్లా ఎంపిక కమిటీ కర్నూలు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి.