Banaganapalle: కాటసాని ఆరోపణలపై విరుచుకుపడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి!
Banaganapalle: ఎస్ఆర్బిసి నీటిపై కాటసాని ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాయలసీమకు వైఎస్సార్సీపీనే ద్రోహి అని తీవ్ర ఆగ్రహం.
Banaganapalle: కాటసాని ఆరోపణలపై విరుచుకుపడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి!
Banaganapalle: బనగానపల్లె టిడిపి కార్యాలయంలో రైతు సంఘం నాయకులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం. ఎస్ఆర్బిసి కి నీటిని విడుదల చేయాలి పరిశ్రమలకు నీళ్లు అమ్ముకుంటున్నారన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపణలను ఖండించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
కేవలం రాజకీయ లబ్ధి కోసం కాటసాని రామిరెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ రాయలసీమకు ద్రోహులు ప్రజలంతా 2019లో అత్యధిక స్థానాలు ఇచ్చారు రాయలసీమ నీటి కోసం మీరు ఏమి చేశారో రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎలినో ప్రభావం ఉండటంవల్ల నాలుగు నెలలుగా వర్షాలు తక్కువగా ఉన్నాయి పంటలు వేసుకోవద్దని అధికారులు చెబుతున్నారు.
గాలేరు నగరి కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్కు 1TMC నీటిని తాగునీటి కోసము పంపుతున్నాము. పరిశ్రమలకు నీటిని వ్యాపారం కోసం కాదు సిమెంట్ ఫ్యాక్టరీకి లో పేదవారు బ్రతుకుతున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అవుకు రిజర్వాయర్ ద్వారా నాలుగు మండలాలు అవుకు, సంజామల, కొలిమిగుండ్ల కోవెలకుంట్ల మండలాలకు ఎండాకాలంలో వచ్చేసరికి నీరు నిల్వ ఉండాలని స్టోరేజ్ చేస్తున్నాం.
ఎస్ ఆర్ బి సి ద్వారా నీటి విడుదలపై కొన్ని సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడాము. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు కురవవు వైసిపి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
గత ఐదు సంవత్సరాల కాలంలో దద్దనాల ప్రాజెక్టు కు చుక్కనీరు కూడా విడుదల చేయలేదు కోటి రూపాయలు పెట్టి పంపుహౌస్ ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నాం రాజకీయంగా మాట్లాడడం సరికాదు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
కార్యక్రమంలో ఎస్ ఆర్ బి సి డిసి ప్రెసిడెంట్ జిల్లెల్ల శేఖర్ రెడ్డి డబ్ల్యూఏ చైర్మన్ నారాయణరెడ్డి వల్లంపాడు, నరసింహారెడ్డి రఘునాథరెడ్డి పాల్గొన్నారు.