Kothagudem: ప్రవక్త బోధనలు మానవాళికి ఆచరణీయం – సాబీర్ పాషా
Kothagudem: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా కొత్తగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.
Kothagudem: ప్రవక్త బోధనలు మానవాళికి ఆచరణీయం – సాబీర్ పాషా
కొత్తగూడెం: మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, కరుణ, సేవా మార్గాలు యావత్ మానవాళికి ఆచరణీయమని, ఆయన బోధనలు సమాజ హితానికి దిక్సూచిగా నిలుస్తాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు.
దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘మిలాద్ ఉన్ నభి’ వేడుకల్లో భాగంగా అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అమీర్ ఖాద్రి ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి, ఆధ్యాత్మికత దాగి ఉన్నాయని అన్నారు.
సమాజంలో మత సామరస్యాన్ని, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పేదరికం, ఆకలి లేని సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంజుమన్ కమిటీ రోగుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధామోహన్, మైనార్టీ సంఘాల పెద్దలు ఖాజా బాబా, ఎండీ యూసుఫ్, గౌస్ మొయినుద్దీన్, షమ్మీద్దీన్, కార్పొరేటర్ దావూద్, విజయ్, చారి, గడ్డం సతీష్, ఇమ్రాన్, అజీజ్, ఎండీ జహీర్ అలీ, టీచర్ దస్తగిరి, జహీర్, షాహూద్ రజా, మెహబూబ్ ఖాద్రి, హాజీ రంజాన్ ఖాన్, జమాల్ జుబేద్ ఆలం, ఇర్ఫాన్ యాకూబ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.