Palvancha: సర్వే నెం.444లో భారీ నిర్మాణాలు.. అనుమతులు ఉన్నాయా?
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సర్వే నంబర్ 444 ప్రభుత్వ భూమిలో అక్రమ భారీ నిర్మాణాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Palvancha: సర్వే నెం.444లో భారీ నిర్మాణాలు.. అనుమతులు ఉన్నాయా?
Palvancha: ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారుల పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 444 పూర్తిగా ప్రభుత్వ భూమి. అలాంటి ప్రభుత్వ భూమిలో భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్వే నంబర్ 444 పూర్తిగా ప్రభుత్వ భూమి కావడంతో ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలపై అనుమతుల అంశం మరింత కీలకంగా మారింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు ఎలా వచ్చాయి? లేదా ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రధాన రహదారి పక్కనే బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెబుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. సర్వే నంబర్ 444లో జరుగుతున్న నిర్మాణాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఈ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉన్న సర్వే నంబర్ 444ను పరిరక్షించడంతో పాటు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.