Bhadrachalam: గోదావరిలోకి నిమిషానికి వరద నీరు విడుదల!

Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

Update: 2026-08-26 05:17 GMT

Bhadrachalam: గోదావరిలోకి నిమిషానికి వరద నీరు విడుదల!

Bhadrachalam: ఆగస్టు 26-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరటం తో ప్రాజెక్టు కు జలకళ సంచరించింది. ఛత్తిస్ గడ్ రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షా లకు పలువాగులు వంకలు పొంగి ప్రాజెక్టు కు భారీగా వరద నీరు వచ్చింది.

ప్రస్తుతం 20000క్యూ సెక్కుల వరద నీరు రావటం తో 24గేట్ల లో 12గేట్లు ఎత్తి దిగువున గోదావరి లోకి 1600క్యూ సెక్కుల వరద నీటిని వదిలారు. ప్రస్తుతం 73 మీటర్ల మేర వాటర్ లెవల్ ఉన్నది. ప్రాజెక్టు 74మీటర్లు.. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీటిని గోదా వరిలోకి విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News