Khammam: పొలం గట్టున శ్రమజీవులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి!
Khammam: ఖమ్మం జిల్లా రాయన్నపేటలో పొలం గట్టున మహిళా కూలీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చటించారు.
Khammam: పొలం గట్టున శ్రమజీవులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి!
Khammam: ఖమ్మం జిల్లా, రాయన్నపేట శివార్లలో మల్లు భట్టి విక్రమార్క పర్యటన, మహిళా కూలీలుతో ఆత్మీయత పలకరింపు. పొలం గట్టున శ్రమజీవులతో ముచ్చటించిన భట్టి విక్రమార్క. కూలీల మధ్యకు నేరుగా వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
హంగూ ఆర్భాటాలకు దూరంగా పంట పొలాల్లో మహిళా కూలీలతో ముచ్చట. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా ఆరా, సన్నబియ్యంతో పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతున్నాం అంటూ తెలిపిన మహిళా కూలీలు.
రూపాయి కరెంటు బిల్లు కూడా రావడం లేదని శ్రమజీవుల ఆనందం. ఉచిత బస్సు ప్రయాణంతో కూలీల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందని వెల్లడి. ప్రజా ప్రభుత్వం పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని మహిళల హర్షం. ప్రజల అవసరాలు గుర్తించి వాటిని తీర్చడమే ప్రజా ప్రభుత్వ బాధ్యత: భట్టి విక్రమార్క. ఉచిత సంక్షేమ పథకాలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తోంది: డిప్యూటీ సీఎం.