Kothagudem: ఆగస్టు 31న జిల్లా వ్యాప్తంగా 'ప్రజావాణి' అర్జీల స్వీకరణ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో ఆగస్టు 31న ప్రజావాణి. అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం.

Update: 2026-08-30 14:08 GMT

Kothagudem: ఆగస్టు 31న జిల్లా వ్యాప్తంగా 'ప్రజావాణి' అర్జీల స్వీకరణ!

Kothagudem: ఆగస్టు 31 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10గంటలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు.

ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవోకార్యాలయంలో,జిల్లాలోని అన్నీ మండల పరిషత్ కార్యాలయాలలో ప్రజావాణి నిర్వహించబడుతుందని తెలిపారు.కావున ప్రజలు ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో ఆదివారం కోరారు.

Tags:    

Similar News