Palvancha: పాల్వంచ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్‌కు భారీ షాక్. కేసీఆర్‌కు పాల్వంచ ఎల్‌ఎస్‌సీఎస్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ రాజీనామా లేఖ.
Palvancha: పాల్వంచ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పాల్వంచ లార్జ్ సైజ్డ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు 30-05-2026 తేదీతో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. 2014లో పార్టీలో చేరి 12 ఏళ్లుగా పని చేశానని, 2020లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు.
అయితే కొత్తగూడెం నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లుగా నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, సరైన దిశానిర్దేశం లేక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీలో కొనసాగలేనని, రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. లేఖను కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు పంపారు.