Kothagudem: కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతిభ..

Kothagudem: టీజీ ఈసెట్-2026 ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి మొహమ్మద్ రయ్యాన్ హష్మీ సరికొత్త రికార్డు.

Update: 2026-05-30 04:58 GMT

Kothagudem: కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతిభ..

కొత్తగూడెం: టీజీ ఈసెట్-2026లో మెకానికల్ విభాగంలో స్టేట్ 6వ ర్యాంకు సాధించిన మొహమ్మద్ రయ్యాన్ హష్మీ. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఈ-సెట్-2026 ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి మొహమ్మద్ రయ్యాన్ హష్మీ రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించడమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ కేటగిరీలోనూ 587వ ర్యాంకు సాధించి డబుల్ ఘనత సాధించాడు.

మే 14న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ-సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన రయ్యాన్ హష్మీ, బీటెక్ లో చేరేందుకు ఈసెట్ రాసి టాప్-10లో నిలిచాడు. రయ్యాన్ సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. “ప్రభుత్వ కళాశాలలో చదివి, పట్టుదలతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తి అని,

రయ్యాన్ కష్టపడే తత్వం, క్రమశిక్షణ అందరికీ ఆదర్శం" అని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా రయ్యాన్ హష్మీ మాట్లాడుతూ, “తన విజయం వెనుక తల్లిదండ్రులు, లెక్చరర్ల ప్రోత్సాహం ఉందని. డిప్లొమా చదువుతూనే రోజూ 6-7 గంటలు ఈసెట్ కు ప్రిపేర్ అయ్యానని, లక్ష్యం ఉంటే మంచి ఫలితాలు, ర్యాంకు సాధించవచ్చని తెలిపాడు.

బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ విభాగంలో చేరి భవిష్యత్తులో పరిశోధనా రంగంలో రాణించాలని ఉందని తెలిపాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ప్రభుత్వ కళాశాలలో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన రయ్యాన్ విజయం జిల్లా విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపిందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు రయ్యాన్ కు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News