Peddapalli: కూనారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన తాసిల్దార్
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. అర్హులైన ప్రతి పేదవానికి పారదర్శకంగా సరుకులు అందుతాయని తాసిల్దార్ రాముడు వెల్లడి.
Peddapalli: కూనారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన తాసిల్దార్
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో సర్పంచ్ మంతెన రాజయ్య ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా తహసిల్దార్ రాముడు హాజరై గ్రామస్తులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రాముడు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి పేదవానికి పారదర్శకంగా, సులభంగా నిత్యావసర సరుకులు అందుతాయి అన్నారు.
సాంకేతికతను ఉపయోగించుకుని రూపొందించిన ఈ డిజిటల్ కార్డుల వల్ల రేషన్ పంపిణీలో అక్రమాలకు తావుండదు అన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనేదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మని అర్హత ఉండి ఇంకా కార్డులు రాని వారు ఆందోళన చెందవద్దని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విచారణ జరిపి త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తాం అన్నారు.గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంతెన రాజయ్య, ఉప సర్పంచ్ బోడుకుంట తిరుపతి జిపిఓ శ్రీనివాస్ వార్డు సభ్యులు సీతారాములు శంకర్ లక్ష్మణ్ శ్రీను లత శ్రీ గ్రామ పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.