Manthani: కమాన్‌పూర్‌లో ఘనంగా ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు!

Manthani: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ స్వయంభూ శ్రీ ఆదివరాహ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-08-26 14:11 GMT

Manthani: కమాన్‌పూర్‌లో ఘనంగా ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు!

మంథాని: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహ స్వామి ఆలయంలో బుధవారం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవల్లో విశేషంగా పాల్గొన్న వారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో మెమెంటోలను శ్రీను బాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, ఆలయ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News