Peddapalli: ఒకే పౌరుడికి రెండు ఓట్లు ఉంటే నేరం తహసీల్దార్ రాముడు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కూనారంలో ప్రత్యేక ఓటర్ల సవరణ గ్రామసభ. డబుల్ ఓట్లు నేరమని, ఒకే ఓటు ఉండాలని హెచ్చరించిన తాసిల్దార్ రాముడు.
Peddapalli: ఒకే పౌరుడికి రెండు ఓట్లు ఉంటే నేరం తహసీల్దార్ రాముడు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని కూనారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాసిల్దార్ రాముడు, సర్పంచ్ మంతెన రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించి, ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ రాముడు మాట్లాడుతూ చట్టప్రకారం దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలని, రెండు ఓట్లు కలిగి ఉండడం నేరమని స్పష్టం చేశారు. కూనారం గ్రామంలో 2400 పైచిలుకు ఓట్లు ఉన్నాయని దీంట్లో 157 డబుల్ ఓట్లు మరణించిన వారి ఓట్లు తొలగించామని, 25 నాన్ మ్యాపింగ్ ఓట్లు జరిగాయని వీటికి సంబంధించి గ్రామపంచాయతీ కార్యాలయంలో నోటీసులు అందించి సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు.
సరైన వివరాలు అందించని వారికి, అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని, చిన్నచిన్న పొరపాట్లు ఉంటే తగిన ఆధారాలు చూపి సరిచేసుకోవచ్చని సూచించారు.
ఓటు నిరూపణకు నిర్దేశిత అర్హత తేదీలు:
1987 జులై 1 కంటే ముందు పుట్టినవారు: తమ స్వంత వివరాలు సమర్పిస్తే సరిపోతుంది అన్నారు.
1-7-1987 నుండి 2-12-2004 మధ్య పుట్టినవారు: తమ వివరాలతో పాటు తల్లి లేదా తండ్రి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి అన్నారు.
2-12-2004 తర్వాత పుట్టినవారు: తమ ఆధారాలతో పాటు తల్లి, తండ్రి ఇద్దరి వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి అన్నారు.ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ఫార్మ్-6 ద్వారా కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని, పేర్లు/చిరునామా సవరణలు లేదా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకోవడానికి ఫార్మ్-8 వినియోగించుకోవాలని తాసిల్దార్ కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంతెన రాజయ్య, ఉప సర్పంచ్ బోడకుంట తిరుపతి, జి పి ఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు గ్రామస్తులు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.