Sircilla: రాఖీ కానుకగా సోదరులకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి ట్రాఫిక్ ఎస్సై

Sircilla: సిరిసిల్ల నేతాజీ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. రాఖీ పండుగకు సోదరులకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ పిలుపు.

Update: 2026-08-27 08:07 GMT

Sircilla: రాఖీ కానుకగా సోదరులకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి ట్రాఫిక్ ఎస్సై

Sircilla: రాఖీ పండుగ సందర్భంగా సోదరునికి హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ సూచించారు. నేతాజీ డిగ్రీ కళాశాలలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. రాఖీ సందర్భంగా సోదరులకు హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చి, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అనంతరం కళాశాలలో ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News