Karimnagar: రీల్స్ చేస్తూ రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు.. గంగాధర యువకుడి విజయం!

Karimnagar: కరీంనగర్ జిల్లా వెంకటాయపల్లికి చెందిన కందుల జయంత్ సోషల్ మీడియా విజయగాథ. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న జయంత్.

Update: 2026-04-05 01:56 GMT

Karimnagar: రీల్స్ చేస్తూ రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు.. గంగాధర యువకుడి విజయం!

Karimnagar: సోషల్ మీడియా యుగంలో అవకాశాలు విస్తరిస్తున్నాయి. ప్రతిభ ఉంటే చాలు.. ఇంట్లో నుంచే ప్రపంచాన్ని ఆకట్టుకుని ఆదాయం సంపాదించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అలాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు హాయ్ నేను కొత్తగా వచ్చినోన్ని అంటూ పలకరించే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కందుల జయంత్.

గౌడ్ సింగిల్ ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఫేస్బుక్ వంటి వేదికలను వినియోగించుకుని తన ప్రత్యేకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ… అదే సమయంలో ఉపాధిని కూడా పొందుతున్నారు జయంత్. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉంటే సోషల్ మీడియా కూడా ఒక కెరీర్ మార్గమవుతుందని ఆయన నిరూపిస్తున్నారు.

ఇప్పటి యువతకు సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే కాదు… ఉపాధి మార్గంగా కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో కందుల జయంత్ తన ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇంస్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో వీడియోల రూపంలో విభిన్న కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఆయన వీడియోలు వినోదంతో పాటు సామాజిక సందేశాలను కూడా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

సృజనాత్మక ఆలోచనలతో పాటు, నిరంతర కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని జయంత్ చెబుతున్నారు. యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన దిశలో ప్రయత్నిస్తే సోషల్ మీడియా ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన సూచిస్తున్నారు.

Tags:    

Similar News