Vemulawada: హనుమాజీపేటలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన చెన్నమనేని వికాస్ రావు!
Vemulawada: హనుమాజీపేటలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెన్నమనేని వికాస్ రావు ప్రారంభించారు.
Vemulawada: హనుమాజీపేటలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన చెన్నమనేని వికాస్ రావు!
వేములవాడ: హనుమాజీపేట గ్రామం కళాకారులకు కళలకు పెట్టిన కోటని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చెన్నమనేని వికాస్ రావు అన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమాజీపేటలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాగ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బిజెపి నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ జిమ్ ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ కోరిక మేరకు గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు గతంలో కూడా గ్రామంలో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. వ్యాయామం చేయడంవల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
యువత ఫిట్నెస్ పై దృష్టి సారించాలని సూచించారు వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వము తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలు వ్యాయామంపై దృష్టి సారించాలన్నారు హనుమాజీపేట గ్రామం కళలు తో పాటు భవిష్యత్తులో క్రీడాకారుల ఖిల్లాగా వెలుగొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకం ఖేలో ఇండియాలో భాగంగా 8 ఏళ్లలో 50 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుందన్నారు. పాఠశాలలో క్రీడా మైదానం పిఈటిలు ఉండాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్తులో దేశానికి మెడల్స్ తీసుకొస్తారని అన్నారు.