Karimnagar: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాజీవ్ రహదారిపై బీజేపీ ధర్నా!

Karimnagar: గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు.

Update: 2026-08-10 07:33 GMT

Karimnagar: డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రాజీవ్ రహదారిపై బీజేపీ ధర్నా!

Karimnagar: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుండి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు బీటీ డబుల్ రోడ్ నిర్మాణం కోసం గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారి పైన బీజేపీ గన్నేరువరం మండల నాయకులు ధర్నా చేశారు.

ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

చేతకాకుంటే ఎమ్మెల్యే కవంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేపట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి ఇప్పుడు ఎందుకు రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని వారు ప్రశ్నించారు.

కేవలం స్వలాభం కోసమే కవంపల్లి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.నెల రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షులు నికేష్ తిప్పర్తి, జిల్లా నాయకులు సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఏలేటి చంద్రారెడ్డి, ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News