Karimnagar: తెలంగాణలో బహుజన రాజ్యమే లక్ష్యం.. బండి సంజయ్ కుమారుడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? - బీఎస్పీ
Karimnagar: కరీంనగర్‌లో బీఎస్పీ జోనల్ సమావేశం. తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు పిలుపు.
Karimnagar: తెలంగాణలో బహుజన రాజ్యమే లక్ష్యం.. బండి సంజయ్ కుమారుడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? - బీఎస్పీ
కరీంనగర్ :- తెలంగాణ లో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని బీఎస్పీ ఛీఫ్ సెక్టార్ కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావు అన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన జోన్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అతర్ సింగ్ రావు మహానీయుల చిత్రపటాలకు పూల తో నివాళులు అర్పించి నాలుగు పార్లమెంట్ ల నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు తెలంగాణ లో బహుజన్ సమాజ్ పార్టీ ని బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. బహుజన ఉద్యమ పితామహులు మహాత్మా ఫూలే, సాహూ మహారాజ్ , బాబాసాహేబ్ అంబేడ్కర్ ల సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి అమ్ముడుపోని సమాజం ను తయారు చేసి బెహన్ జీ మాయావతి నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని అన్నారు .
ఉత్తర్ ప్రదేశ్ లో బెహన్ జీ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో బహుజన సమాజం మీద దాడులను అరికట్టి నేరాలను నియంత్రించి సమాజంలో ఉక్కు మహిళా గా చరిత్ర లో నిలిచిపోయింది. 14 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు అని అన్నారు . బిఎస్పీ పార్టీ ని అన్ని పార్టీలు నకలు కొడుతున్నాయి అన్నారు. లక్నో లో బాబాసాహేబ్ అంబేడ్కర్ ఫూలే విగ్రహాలను వ్యతిరేకిస్తున్న పార్టీ లు చైనా నుండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారని విమర్శించారు. ఈ మనువాద మీడియా మన ఉద్యమం మీద వ్యతిరేక వార్తాలను సృష్టిస్తుందని విమర్శించారు. అనంతరం అన్ని జిల్లా కమిటీ లను అసెంబ్లీ కమిటీ లను సమీక్షిస్తూ సరైన కారణం లేకుండా హజరు కాని ఒక జిల్లా కమిటీ ని ఒక అసెంబ్లీ కమిటీ ని రద్దు చేశారు. ఈ సమావేశంలో మరో ఛీఫ్ సెక్టార్ కో ఆర్డినేటర్ సురేష్ ఆర్య మాట్లాడుతూ దేశం లో వెనుకబడిన బిసి కులాలకు జనాభా దామాషా న రాజ్యాధికారం లభించాలంటే బిఎస్పీ తోనే సాధ్యమని అన్నారు . వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు అనాది నుంచి మోసం చేస్తున్నాయని అన్నారు.
బండి సంజయ్ కోడుకు ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ?
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు ను పోక్సో కేసు లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్ అన్నారు . పోలీసులు చట్టప్రకారం పని చేయాలి అన్నారు. ఈ రాష్ట్రంలో తొంబై శాతం ప్రభుత్వ పాఠశాలలలో బాలికలకు ముత్రశాలలు లేవన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం కి పేద బాలికల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు.
అదేవిధంగా బీఎస్ఫి రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ లో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పై హత్యలు , మానబంగాలు జరగడానికి కారణం బహుజనులకు రాజ్యాధికారం లేకపోవడమే అన్నారు . ఈ సమావేశంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ బొయిని చంద్ర శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ బిసి సమాజం ఫూలే అంబేడ్కర్ గార్ల సిద్ధాంతాలను ఆచరిస్తూ రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్ ఎనగందుల వెంకన్న , జోన్ ఇంచార్జ్ లు గైని గంగాధర్, కల్లెపెల్లి రాజేందర్ , పల్లే ప్రశాంత్ గౌడ్ , జిల్లా అధ్యక్షుడు నల్లా శ్రీనివాస్ , నాలుగు పార్లమెంట్ ఇంచార్జ్ లు , తొమ్మిది జిల్లాల అధ్యక్షులు అసెంబ్లీ ల ఇంచార్జ్ లు అసెంబ్లీ కమిటీ ల వారు హజరయ్యారు.