Karimnagar: అభివృద్ధిని వదిలి దాడులు చేస్తారా?.. కరీంనగర్ నేతలపై కొరివి వేణుగోపాల్ ఆగ్రహం!

Karimnagar: తెలంగాణలో పెరుగుతున్న దొంగతనాలు, హత్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ పిలుపు.

Update: 2026-05-15 04:28 GMT

Karimnagar: అభివృద్ధిని వదిలి దాడులు చేస్తారా?.. కరీంనగర్ నేతలపై కొరివి వేణుగోపాల్ ఆగ్రహం!

కరీంనగర్: తెలంగాణ ప్రజలు దొంగల నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం జరిగిన నగల దోపిడీ, హైదరాబాదులో రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేయడం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు లక్షలాదిమంది ఇక్కడ వారు పలువృత్తుల్లో ఉండడం వలన అన్ని రాష్ట్రాల్లో ఉన్న దొంగలకు తెలంగాణ విషయాలు తెలుసుకోవడం చాలా సులభం అయింది అన్నారు.

తెలంగాణలో సులభంగా దొంగతనం చేసి పారిపోవచ్చని ఒక ఆలోచనలతో వారు ఉన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి తెలంగాణ పోలీసులు వారి డ్యూటీని వారు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఒక అప్రమత్తమైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ఈ విషయమై ప్రతిపక్ష బి ఆర్ ఎస్ నేత కేటీఆర్ కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు పై ప్రతి స్పందించిన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోమ్ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సంబంధంలేని ఘాటైన విషయాలను మాట్లాడారు దాన్ని సవాల్ చేస్తూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ కు వచ్చి విమర్శించడం సవాళ్లు ప్రతి సవాళ్లు చేయడం దీన్ని రియాక్షన్ గా బీజేపీ పార్టీ కార్పొరేటర్లు వారి అన్యుయులు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం ఇదంతా వీరు కరీంనగర్ ను ఎటువైపు తీసుకపోవాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పక్క జిల్లా వరంగల్ నాయకులు ఆరువేల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలట్ చేయించుకున్నారు. కరీంనగర్ కు మరి మీరు ఏం తీసుకువచ్చారని అడిగారు. కరీంనగర్ ను గ్రీన్ సిటీని, అలాగే యువత ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రభుత్వ విద్యాలయాలను ఎట్ల తీసుకురావాలనే ఆలోచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఈ మీడియా సమావేశంలో సిగిరి శ్రీధర్, ఎడ్ల రామ్ కుమార్, కొంపల్లి రవీందర్, బైరం రాజేందర్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News