Rayachoti: సెప్టెంబర్ 5న రాయచోటిలో మంత్రుల బృందం పర్యటన!

Rayachoti: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సెప్టెంబర్ 5న రాయచోటిలో మంత్రుల బృందం పర్యటించనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు.

Update: 2026-09-02 13:12 GMT

Rayachoti: సెప్టెంబర్ 5న రాయచోటిలో మంత్రుల బృందం పర్యటన!

రాయచోటి: ప్రజలకు మరింత చేరువగా ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో సెప్టెంబర్ 5వ తేదీన రాయచోటి నియోజకవర్గంలో మంత్రుల బృందం పర్యటించనుందని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలోతెలిపారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మరియు అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసి రాయచోటి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

ప్రజలు, పార్టీ శ్రేణులతో నేరుగా మంత్రులు

సెప్టెంబర్ 5న ఉదయం రాయచోటిలో మంత్రుల పర్యటన ప్రారంభమై, అనంతరం ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్, రవాణా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

అభివృద్ధి పనులపై మంత్రుల సమీక్ష.

రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రోడ్లు, విద్యుత్, రవాణా తదితర శాఖల పరిధిలోని అంశాలపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించి తగిన చర్యలకు ఆదేశాలు ఇవ్వనున్నారు.

అనంతరం కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం.

ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కార మార్గాలను చూపించడం ప్రజా చేరువ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రుల పర్యటన దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

పై కార్యక్రమాలలో నియోజకవర్గంలోని కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Tags:    

Similar News