Kadapa: నాకు నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నువ్వంటే ఇష్టం లేదు

Kadapa: కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత 'నువ్వంటే ఇష్టం లేదు' అని వరుడు వేధించడంతో ఎమ్మెస్సీ విద్యార్థిని రెహానా ఆత్మహత్య. 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Update: 2026-04-22 08:47 GMT

Kadapa: నాకు నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నువ్వంటే ఇష్టం లేదు

Kadapa: నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి, వరుడి మానసిక వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది. 'నువ్వంటే నాకు ఇష్టం లేదు.. నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు' అంటూ కాబోయే భర్త పదేపదే అవమానించడంతో మనస్తాపం చెందిన బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. వైఎస్సార్ కడప జిల్లా చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప పటేల్ రోడ్డుకు చెందిన రెహానా (26) ప్రతిభావంతురాలైన విద్యార్థిని. ఇటీవలే ఆమె ఎమ్మెస్సీ (M.Sc) పూర్తి చేసి, గవర్నర్ చేతుల మీదుగా పట్టా కూడా అందుకుంది. ఆమెకు ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

నిశ్చితార్థం జరిగినప్పటి నుండి వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే, గత కొన్ని రోజులుగా షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. "నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు.. నాకు ఇప్పటికే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు" అంటూ రెహానాను వేధించడం మొదలుపెట్టాడు. తొలుత వీటిని జోక్‌గా భావించిన రెహానా, ఆ తర్వాత అతడి వేధింపులు మితిమీరడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది.

షాజహాన్ మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా, సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ లభ్యమైన 12 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి గల కారణాలను అందులో వివరించినట్లు తెలుస్తోంది. రెహానా తండ్రి ఫిర్యాదు మేరకు చిన్నచౌకు ఎస్సై ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags:    

Similar News