Srisailam: విధి నిర్వహణలో ఉండగానే మృత్యువు దాడి!
Srisailam: శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదం. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి తేనెటీగల దాడిలో మృతి చెందారు.
Srisailam: విధి నిర్వహణలో ఉండగానే మృత్యువు దాడి!
Srisailam: విధి నిర్వహణలో ఉన్న ఒక రక్షణ సిబ్బందిని ప్రకృతి రూపంలో మృత్యువు కబళించింది. శ్రీశైలం డ్యామ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఎస్పీఎఫ్ (SPF) కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు.
సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగల దాడిలో కానిస్టేబుల్ మృతి, శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగలు దాడి చేయడంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి మృతి చెందారు. డ్యాంపై ఉన్న లిఫ్టు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టాయి. భయాందోళనతో ఆయన కింద పడిపోగా, ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఈ దాడిలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.