Kurnool: మాటల ప్రభుత్వం.. చేతల శూన్యం జిల్లా సాగునీటి సమస్యలపై సీపీఎం గర్జన!
Kurnool: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యంపై సీపీఎం నేత గౌస్ దేశాయ్ ఆగ్రహం. హంద్రీనీవా, గుండ్రేవుల ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్.
Kurnool: మాటల ప్రభుత్వం.. చేతల శూన్యం జిల్లా సాగునీటి సమస్యలపై సీపీఎం గర్జన!
Kurnool: జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని మాటలు చెప్తూ కాలం వెళ్ళబుస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. బుధవారం నాడు సిపిఎం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులైన హంద్రీనీవా, వేదవతి ,గురు రాఘవేంద్ర, గుండ్రేవుల, మెలగనూరు వరద కాలువ వంటి సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చేయి చూపిందని ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఏటా వేలమంది పశ్చిమ ప్రాంతం నుండి వలస వెళుతున్నారని వలస వెళ్లిన ప్రజలు అనేక ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని తెలిపారు.
వలస వెళ్లిన ప్రాంతాల్లో సరైన మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు విస్తృతంగా నీటి సదుపాయం ఉన్న ప్రభుత్వాల ఉదాసినత చేతకానితనం వల్ల ప్రాజెక్టులు పూర్తి కావడంలేదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే బడ్జెట్ కేటాయింపులు కేటాయించాలని వాటిని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం సిపిఎం రాబోయే రోజుల్లో విస్తృత పోరాటాలకు శ్రీకారం చేపట్టబోతుందని జిల్లా రైతాంగం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, ఆనంద్ బాబు, వీరశేఖర్, గుణశేఖర్, మండల నాయకులు మహబూబ్ బాషా, యూసుఫ్ బాషా, ఆయా గ్రామాల నాయకులు బజారి, గాజుల శ్రీనివాసులు,పాండు, నాగేంద్ర, మహేంద్ర, పురుషోత్తం, మార్కండేయులు,కౌలుట్ల శ్రీనివాసులు, బీరప్ప, లక్ష్మిరెడ్డి, సుంకన్న ,నాగేషు తదితరులు పాల్గొన్నారు.