Nandyal: రిటైర్డ్ అధికారి.. రియల్ హీరో! 16 ఏళ్లుగా పేదలకు సొంత పింఛన్లు

Nandyal: కోవెలకుంట్ల రిటైర్డ్ లైబ్రరీ అధికారి పల్లె నరసింహారెడ్డి అరుదైన సేవ. 16 ఏళ్లుగా సొంత డబ్బులతో పేదలకు పింఛన్ల పంపిణీ. ప్రకృతి పీఠం ద్వారా 150 మందికి సాయం.

Update: 2026-04-05 06:06 GMT

Nandyal: రిటైర్డ్ అధికారి.. రియల్ హీరో! 16 ఏళ్లుగా పేదలకు సొంత పింఛన్లు

నంద్యాల జిల్లా: 16 సంవత్సరాలుగా సొంత నిధులతో ఉచిత పింఛన్లు పంపిణీ చేస్తున్న కోవెలకుంట్ల రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నరసింహారెడ్డి.2011 వ సంవత్సరంలో పకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన పల్లె నరసింహారెడ్డి.

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాధలు ,వృద్ధులు , వితంతులు , దివ్యాంగులకు , ప్రతినెల పింఛన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.పదవి విరమణ పొందిన ప్రజా సేవకు అంకితమైన నరసింహారెడ్డి.16 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో ఉచిత పెన్షన్ అందజేస్తున్న వైనం.ప్రజల మన్ననలు అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నర్సింహారెడ్డి.ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలమరుచుకొని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు.కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా ఉచిత పింఛన్లు అందజేస్తున్నామన్నారు.

Tags:    

Similar News