Kurnool: అశ్లీల వ్యవహారాలు సిగ్గుచేటు.. టీటీడీ ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన.

Update: 2026-04-04 07:37 GMT

Kurnool: అశ్లీల వ్యవహారాలు సిగ్గుచేటు.. టీటీడీ ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి!

Kurnool: కోడుమూరులోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు మహిళలు, కోడుమూరు ఇంచార్జ్ ఆదిమూలపు సతీష్ స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ శ్రీ వేంకటేశుని పవిత్ర దేశ వ్యాప్తంగా ఉన్నాది.అలాంటి స్వామి వారి ఆలయానికి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు ఆడవారితో ఆయన చేసిన అశ్లీల వ్యవహారాలు సిగ్గు సిగ్గు . అలాంటి పదవికి ఆయన సరికాదు కాబట్టి కూటమి ప్రభుత్వం తనను తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా తానే రాజీనామా చేయాలి. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రోడ్లపై కేటాయించి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఆదిమూలపు సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, కృష్ణారెడ్డి, రవి రెడ్డి, వైసిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News