Vikarabad: నిప్పులు కురిపించిన ఆకాశం.. పరిగిలో బీభత్సం!

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ పిడుగుపాటు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టు పూర్తిగా దగ్ధమైంది.

Update: 2026-03-25 01:22 GMT

Vikarabad: నిప్పులు కురిపించిన ఆకాశం.. పరిగిలో బీభత్సం!

వికారాబాద్ జిల్లా: పరిగిలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గత ఒక గంట నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తూ భారీ పిడుగు పడింది.రోడ్డు పక్కనే ఉన్న ఒక భారీ చెట్టుపై పిడుగు పడటంతో, క్షణాల్లోనే ఆ చెట్టు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పిడుగు పడ్డ ధాటికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Tags:    

Similar News