Kurnool: కూలిన మిద్దె.. చిక్కుకున్న చిన్నారి కోడుమూరు మెయిన్ బజార్‌లో ఉత్కంఠ!

Kurnool: కోడుమూరు మెయిన్ బజార్ లో మట్టి మిద్దె కూలి 13 ఏళ్ల చిన్నారి మానస మట్టి కింద చిక్కుకుపోయింది. స్థానికులు సాహసించి చిన్నారిని కాపాడారు.

Update: 2026-04-06 06:42 GMT

Kurnool: కూలిన మిద్దె.. చిక్కుకున్న చిన్నారి కోడుమూరు మెయిన్ బజార్‌లో ఉత్కంఠ!

Kurnool: కోడుమూరు పట్టణంలోని స్థానిక మెయిన్ బజార్ నందు ఒక మట్టి మిద్దె ఇల్లు కూలిన ఘటనలో 13 ఏళ్ల చిన్నారికి తృటిలో తప్పిన పెను ప్రమాదం. మిద్దె కూలీన సమయంలో ఇంట్లో ఉన్న మొత్తం 5మంది కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.. పెద్ద కుమార్తె మానస కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు,స్థానికులు మట్టి కుప్పలు తొలగించి,మట్టి కుప్పల్లో కూరుకుపోయిన చిన్నారిని వెలికి తీసి కాపాడారు . 13 ఏళ్ల చిన్నారి మానసను కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితిపై పరీక్షల నిమిత్తం 108 అంబులెన్స్ లో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేనేత పైన ఆధార పడ్డా తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని బండ చంద్ర శేఖర్ కోరారు.

Tags:    

Similar News