Vizianagaram: వర్షాకాలం వస్తోంది.. పారాది వంతెన పనులు వేగవంతం చేయండి!

Vizianagaram: బొబ్బిలి నియోజకవర్గంలో పారాది వంతెన నిర్మాణ పనులపై ఆర్&బి మంత్రికి ఎమ్మెల్యే బేబినాయన వినతి. నిధుల విడుదల, అప్రోచ్ రోడ్ల నిర్మాణంపై చర్చ.

Update: 2026-04-05 06:59 GMT

Vizianagaram: వర్షాకాలం వస్తోంది.. పారాది వంతెన పనులు వేగవంతం చేయండి!

పార్వతీపురం-మన్యం జిల్లా: పర్యటనలో భాగంగా ఆర్&బి మంత్రి బి.సి. జనార్దన రెడ్డి బొబ్బిలి నియోజకవర్గం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో పారాది వంతెన వద్ద స్థానిక ఎమ్మెల్యే బేబినాయన, మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినాయన మంత్రికి పలు ముఖ్యమైన రోడ్డు మరియు వంతెన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ముఖ్యంగా పారాది వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని, అలాగే వంతెనకు సంబంధించిన అప్రోచ్ రోడ్లను పునరుద్ధరించాలని కోరారు.

బొబ్బిలి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలకు కీలకమైన పారాది వంతెన నిర్మాణం అత్యవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వర్షాకాలానికి ముందే పనులు పూర్తి కాకపోతే భారీ వాహనాలను దారిమళ్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక, ఇప్పటికే కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రహదారులు మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు.

Tags:    

Similar News