West Asia War: ఇరాన్ భారీ టార్గెట్...హిట్‌లిస్ట్‌లో గల్ప్ చారిత్రక ప్రదేశాలు
West Asia War Latest News: రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో మొదలైన యుద్ధ ప్రకంపనలు ప్రపంచంలోని చాలా దేశాలను ఆర్థికంగా, భౌగోళికంగా ఇబ్బందుల్లో పడేశాయి.
West Asia War: ఇరాన్ భారీ టార్గెట్...హిట్‌లిస్ట్‌లో గల్ప్ చారిత్రక ప్రదేశాలు
West Asia War: రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో మొదలైన యుద్ధ ప్రకంపనలు ప్రపంచంలోని చాలా దేశాలను ఆర్థికంగా, భౌగోళికంగా ఇబ్బందుల్లో పడేశాయి. ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు రాజకీయ, సైనిక చర్యలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మానవ జీవనాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లోని కీలక వంతెలను లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రకటించి హిట్‌లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ పరిణామం కేవలం యుద్ధ హెచ్చరిక మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాలకు సంకేతంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ వంతెనపై దాడి
ఇరాన్‌లో టెహ్రాన్‌ను అనుసంధానించే వంతెనపై దాడి జరగడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ వంతెన కూల్చివేతను దేశ గౌరవానికి, భద్రతకు జరిగిన నష్టంగా ఇరాన్ భావిస్తోంది. దీనికి ప్రతిగా టెహ్రాన్ నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది. ప్రతీకారం తప్పదు అనే హెచ్చరికతో పాటు గల్ఫ్ దేశాల్లోని వ్యూహాత్మక వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారులు ప్రకటించారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్ హిట్‌లిస్ట్
ఇరాన్ ప్రకటించిన హిట్‌లిస్ట్‌లోని వంతెనలు, నిర్మాణాలు సాధారణమైనవి కావు. ఇందులో పురాతనమైన, వాణిజ్యానికి, దేశాల మధ్య అనుసంధానానికి, చమురు రవాణాకు కీలకమైన మార్గాలుగా ఉన్నాయి. సౌది అరేబియా బహ్రెయిన్‌ను కలిపే కింగ్ ఫహాద్ కాజ్‌వే, దోహాలోని కతారా బ్రిడ్జ్, కువైట్‌లోని షేక్ జాబర్ కాజ్‌వే, అబుదాబిలోని షేక్ జాయెగ్ బ్రిడ్జ్‌లు గల్ప్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారాలు. ఈ వంతెనలు ధ్వంసమైతే రవాణా ఒక్కటే కాలు...చమురు సరఫరా గొలుకు కూడా భారీ స్థాయిలో దెబ్బతింటుంది. ఫలితంగా ప్రపంచంలో చమురు సంక్షోభం తీవ్రమౌతుంది. ఈ దేశాల నుంచి సరఫరా అయ్యే చమురుపైనే ఎక్కువ దేశాలు ఆధారపడుతున్నాయి. అటువంటి కీలక ప్రాంతంలోని వంతెనలు, రవాణా మార్గాలు దెబ్బతింటే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం మరింత తీవ్రమౌతుంది. ఇప్పటికే పలు దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకా దాడులు అధికమైతే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీని వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. తద్వారా సాధారణ ప్రజల జీవన వ్యయం అధికమౌతుంది. చాలా దేశాలు మళ్లీ పేదరికంలోకి నెట్టబడతాయి.
ఇంకా ముందుంది
ఇరాన్ గల్ఫ్ టార్గెట్ అని ప్రకటించడం వెనుక అమెరికా అధ్యక్షుడు ఇంకా ముందుంది అని చేసిన వ్యాఖ్యలే కారణంగా మారాయి. ఈ మాటలు హెచ్చరిక మాత్రమే కాదు. భవిష్యత్తులో అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని చెప్పడానికి ఓ సంకేతం. దీనికి ప్రతిస్పందనగానే ఇరాన్ కూడా తన వైఖరిని మరింత కఠినం చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన హిట్‌లిస్ట్ ఓ రకంగా సైకలాజికల్ వార్‌గా కూడా చెప్పవచ్చు. ప్రత్యర్ధికి భయం కలిగించడం, తన శక్తిని ప్రదర్శించడం అనే లక్ష్యంతో ఇలాంటి ప్రకటనలు వస్తుంటాయి.
ఇలాంటి ప్రకటనల వలన సామాన్య ప్రజల్లో తెలియని భయం పెరుగుతుంది. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం వలన ఆ రెండు దేశాలే కాదు...వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే ఎన్నో దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. గతంలో జరిగిన యుద్ధాల అనుభవాలు ఇవే చెబుతున్నాయి. చిన్న చిన్న సంఘటనలతో ప్రారంభమైన ఉద్రిక్తతలు పెద్ద స్ధాయి యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యుద్ధం ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కాదు. ఇరాన్ - అమెరికా, ఇజ్రాయిల్ మధ్య ఉన్న విభేదాలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం పొందాలి. కానీ, ప్రస్తుతం ఈ దేశాల కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రపంచానికి శుభపరిణామం కాదు.