US Operation : ఆ సమయంలో టెన్షన్ నెలకొంది : ట్రంప్

US Operation : ఇరాన్‌లో కూలిపోయిన యుద్ధవిమానానికి చెందిన పైలట్‌ను రక్షించే సమయంలో అమెరికా దళాలు కొంతసేపు తీవ్ర ఉద్రిక్తతను ఎదుర్కొన్నాయి. రేడియో సంకేతాలు తప్పుదోవ పట్టించడంతో గందరగోళం నెలకొంది.

Update: 2026-04-06 05:55 GMT

US Operation : ఆ సమయంలో టెన్షన్ నెలకొంది : ట్రంప్

US Operation : ఇరాన్‌లో కూలిపోయిన యుద్ధవిమానానికి చెందిన పైలట్‌ను రక్షించే సమయంలో అమెరికా దళాలు కొంతసేపు తీవ్ర ఉద్రిక్తతను ఎదుర్కొన్నాయి. రేడియో సంకేతాలు తప్పుదోవ పట్టించడంతో గందరగోళం నెలకొంది. చివరకు పైలట్‌ సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల ఇరాన్‌లో కూలిపోయిన యుద్ధవిమానానికి చెందిన పైలట్‌ను రక్షించే సమయంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఘటనలో విమానం నుంచి బయటపడిన రెండో పైలట్‌ ఇరాన్‌ దళాలకు చిక్కకుండా తప్పించుకొని పర్వత ప్రాంతాల్లో దాక్కున్నట్లు తెలిపారు.

రేడియో సంకేతాలతో గందరగోళం

మొదట అమెరికా నిఘా విభాగం ఆ పైలట్‌ ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అయితే, ఆ పైలట్‌ నుంచి వచ్చిన రేడియో సంకేతాలు వారికి గందరగోళాన్ని కలిగించాయి. ‘భగవంతుడిదే శక్తి’ అన్నట్లుగా వినిపించిన ఆ సందేశం ముస్లింల మాటలలా అనిపించిందని ట్రంప్‌ పేర్కొన్నారు.

అనుమానాలకు కారణమైన సంకేతాలు

తర్వాత ఆ సంకేతాన్ని సైనిక అధికారులు ‘దేవుడు మంచివాడు’ అని అర్థం చేసుకున్నారు. దీంతో ఆ పైలట్‌ ఇరాన్‌ దళాల చేతుల్లో పడిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. శత్రు దళాలు తప్పుడు సంకేతాలను పంపుతున్నాయేమోనని కూడా భావించారు.

యుద్ధ పరిస్థితుల్లో సహజ స్పందన

అయితే, యుద్ధం లేదా విపత్కర పరిస్థితుల్లో సైనికులు ముందుగా నిర్ణయించిన రహస్య సంకేతాలను మర్చిపోయి సహజసిద్ధంగా స్పందించడం సాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో కూడా అదే జరిగింది.

సురక్షితంగా ఉన్న పైలట్‌

తదుపరి పరిశీలనలో ఆ పైలట్‌ సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. సరైన సంకేతం అందిన వెంటనే రక్షణ చర్యలను వేగవంతం చేసి ఆపరేషన్‌ను విజయవంతంగా కొనసాగించినట్లు సమాచారం.

Tags:    

Similar News