Trump: టెహ్రాన్‌పై నిప్పుల వర్షం.. ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసం.. ట్రంప్ సంచలన వీడియో!

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

Update: 2026-04-05 04:22 GMT

Trump: టెహ్రాన్‌పై నిప్పుల వర్షం.. ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసం.. ట్రంప్ సంచలన వీడియో!

Iran: పశ్చిమాసియా.. ఇప్పుడు ఒక అగ్నిగుండంగా మారింది. శాంతి అనే మాటకు తావులేకుండా, యుద్ధం మొదలైన ఆరో వారంలోనే వినాశనం పరాకాష్టకు చేరింది. ఇన్నాళ్లూ ఒక దేశంపై ఒక దేశం సరిహద్దుల్లో తలపడ్డాయి.. కానీ ఇప్పుడు, ఏకంగా ఇరాన్ గుండెకాయ లాంటి రాజధాని టెహ్రాన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దళాలు జరిపిన ఈ మెరుపు దాడి మామూలుది కాదు. టెహ్రాన్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపించారు. ఈ భీకర దాడులకు సంబంధించిన వీడియోను స్వయంగా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

ట్రంప్ మాటలు వింటుంటే యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. అనాలోచితంగా వ్యవహరిస్తున్న ఇరాన్ సైనిక నాయకులు ఈ దాడిలో అంతమొందించబడ్డారు.. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ ఆయన ఇచ్చిన హెచ్చరిక పశ్చిమాసియా దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు.. ఇరాన్ చర్చలకు రావడానికి కేవలం 48 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. లేదంటే, ఊహించని స్థాయి దాడులు తప్పవని అల్టిమేటం జారీ చేశారు.

అయితే ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా జరిపిన ఈ దాడులను అంతర్జాతీయ యుద్ధ నేరాలుగా అభివర్ణించింది. తమ సైన్యం కూడా దీటుగా స్పందించి, అమెరికా జెట్లను కూల్చివేసిందంటూ ఇరాన్ మీడియా కొన్ని దృశ్యాలను బయటపెట్టింది. అగ్రరాజ్యం వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరులో సామాన్య పౌరులు బలైపోతుండటంపై ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News