Donald Trump: రెండో పైలట్‌ను రక్షించాం : ట్రంప్

Donald Trump: ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన అమెరికాకు చెందిన F-15ఈ ఫైటర్ జెట్‌లోని రెండవ పైలట్‌ను అమెరికా సైన్యం విజయవంతంగా రక్షించింది.

Update: 2026-04-05 08:53 GMT

Donald Trump

Donald Trump: ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన అమెరికాకు చెందిన F-15ఈ ఫైటర్ జెట్‌లోని రెండవ పైలట్‌ను అమెరికా సైన్యం విజయవంతంగా రక్షించింది. ఈ సాహసోపేత ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

అత్యంత సాహసోపేత ఆపరేషన్

ఇరాన్‌లో కూలిపోయిన F-15ఈ ఫైటర్ జెట్‌లోని రెండో పైలట్‌ను కూడా విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అత్యంత సాహసోపేత ఆపరేషన్లలో ఒకటి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దాదాపు రెండు రోజులుగా గల్లంతైన ఈ పైలట్‌ను శత్రు భూభాగంలో తీవ్ర పోరాటం అనంతరం గుర్తించి రక్షించారని అల్ జజీరా కథనం వెల్లడించింది.

ట్రంప్ అధికారిక ప్రకటన

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ, "మా వాడిని రక్షించాం! అమెరికా సైన్యం అత్యంత సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి, మన అధికారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. ఆయన సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అన్నారు.

సైనిక సాంకేతికత మరియు అప్రమత్తత

"ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో శత్రువులు పైలట్‌ను వెతుకుతుండగా, మా సైనికాధికారులు 24 గంటలూ అతడిని పర్యవేక్షించారు. నా ఆదేశాల మేరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ విమానాలను పంపి పైలట్‌ను రక్షించాం. గాయాలు ఉన్నా త్వరలో కోలుకుంటారు,’ అని ట్రంప్ వివరించారు

గోప్యంగా నిర్వహించిన రెండో రేస్క్యూ

కొన్ని రోజుల క్రితం జెట్ కూలిపోగా, ఒక పైలట్‌ను వెంటనే రక్షించారు. అయితే రెండవ పైలట్‌కు ప్రమాదం లేకుండా గోప్యంగా ఆపరేషన్ నిర్వహించారని ట్రంప్ తెలిపారు. ఇద్దరు పైలట్లను వేర్వేరుగా సురక్షితంగా రక్షించడం సైనిక చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు.

ఆపరేషన్ విశేషాలు

ఇరాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, విమానం కోగిలుయే అండ్ బోయర్-అహ్మద్ ప్రావిన్స్‌లో కూలింది. గల్లంతైన పైలట్‌ను గుర్తించిన వారికి 60,000 డాలర్ల రివార్డు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ట్రంప్ ప్రకటన ప్రకారం, ఆపరేషన్‌లో ఒక్క అమెరికన్ సైనికుడికి కూడా హాని రాలేదు.

Tags:    

Similar News