Pakistan: పీఓకేలో పీక్‌ స్టేజ్‌కు నిరసనలు: జులై 9న పాకిస్థాన్‌కు 'ఫైనల్ యాక్షన్' అల్టిమేటం!

Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

Update: 2026-07-06 10:28 GMT

Pakistan: పీఓకేలో పీక్‌ స్టేజ్‌కు నిరసనలు: జులై 9న పాకిస్థాన్‌కు 'ఫైనల్ యాక్షన్' అల్టిమేటం!

Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత వైఖరికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, నాయకులు చేస్తోన్న తిరుగుబాటు రోజురోజుకూ పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఈ ఏడాది జులై 9న 'ఫైనల్ యాక్షన్' (తీవ్రస్థాయి కార్యాచరణ) ప్రారంభిస్తామని జమ్మూకశ్మీర్‌ జాయింట్ అవామీ యాక్షన్‌ కమిటీ (JAAC) పాక్ సర్కారుకు సంచలన అల్టిమేటం జారీ చేసింది. ఈ అంతిమ పోరాటంలో భాగస్వాములు కావాలని పీఓకే ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ సమాజానికి ఆహ్వానం.. 38 పాయింట్ల ఒప్పందంపై పట్టు!

పాక్ ప్రభుత్వం చేస్తోన్న పౌరుల అణచివేతను, మానవహక్కుల ఉల్లంఘనలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు జేఏఏసీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జులై 9న పీఓకేలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రావాలంటూ ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC), ఐక్యరాజ్యసమితి (UN) ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా మరియు అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలను జేఏఏసీ ఆహ్వానించింది.

ప్రస్తుతం జేఏఏసీ పాక్ ప్రభుత్వం ముందు ముఖ్యంగా ఈ క్రింది డిమాండ్లను ఉంచింది:

ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి.

నిరసనకారులపై విధించిన ఆహారం, అత్యవసర మందుల సరఫరా ఆంక్షలను ఎత్తివేయాలి.

నిర్బంధంలో ఉన్న తమ నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలి.

గతంలో కుదిరిన 38 పాయింట్ల ఒప్పందాన్ని అక్షరాలా అమలు చేయాలి.

"ప్రజల శాంతియుత డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తూటాలతో సమాధానం చెబితే.. మాకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి" అని జేఏఏసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

"మాకు భారత్ సహాయం కావాలి.." – వైరల్ వీడియో కలకలం!

ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ జేఏఏసీ (JAAC) అగ్రనేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన పాక్ ప్రభుత్వ అనాగరిక చర్యలను ఎండగట్టారు.

"పాక్ ప్రభుత్వం పీఓకేపై ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది. ఇక్కడ ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది. మాకు భారతదేశం (India) సహాయం కావాలి. భారత్ ముందుకు వచ్చి మాకు మానవతా సహాయం అందించాలి" అని అమన్ ఖాన్ అభ్యర్థించారు.

పరిస్థితులు ఇంకా దిగజారితే పీఓకే పౌరులు ప్రాణాలు దక్కించుకోవడానికి భారత్‌లోకి వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ (LoC) వెంట సరిహద్దులను తెరవాలని ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.

ఉగ్రవాద చట్టం కింద నిషేధం.. 600 మంది అరెస్ట్!

పీఓకేలో గత కొన్నివారాలుగా సాగుతోన్న ఈ ప్రజా నిరసనలను అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం క్రూరమైన పద్ధతులను అవలంబిస్తోంది. ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని (JAAC) పాక్ సర్కారు ఏకంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 600 మందికి పైగా నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశాయి. పీఓకేలోకి వెళ్లే నిత్యావసర సరుకులను, పాలు, మందులను సరిహద్దుల్లోనే నిలిపివేసి ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తోందని స్థానిక పీఓకే సంస్థలు ఆరోపిస్తున్నాయి.

Tags:    

Similar News