Kukatpally: భర్తపై అనుమానంతో గృహిణి ఆత్మహత్య - కూకట్‌పల్లిలో విషాదం

Kukatpally: సుమిత్రానగర్‌లో భర్త ప్రవర్తనపై అనుమానంతో నవనీత (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చీరాలకు వెళ్లడంపై గొడవతో మనస్తాపం చెందినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2026-08-08 11:36 GMT

Kukatpally: భర్తపై అనుమానంతో గృహిణి ఆత్మహత్య - కూకట్‌పల్లిలో విషాదం

భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్య..

కూకట్ పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తపై అనుమానంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్రానగర్‌లో భర్త, అత్తతో కలిసి నివాసం ఉంటున్న డొమ్మాట నవనీత (28) గృహిణిగా నివసిస్తుంది. శనివారం ఉదయం తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద ఉంచి మరో గదిలోకి వెళ్లిన నవనీత.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో పాటు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నేడు భర్త స్నేహితులతో కలిసి చీరాలకు వెళ్లడాన్ని నవనీత వ్యతిరేకించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News