Kukatpally: బోనాల ఉత్సవాలపై ఏసీపీ నరేష్ రెడ్డి సమీక్షా సమావేశం
Kukatpally: బోనాల పండుగ సందర్భంగా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఉత్సవ నిర్వాహకులతో సమావేశమై, పోలీసు నిబంధనలు పాటిస్తూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
Kukatpally: బోనాల ఉత్సవాలపై ఏసీపీ నరేష్ రెడ్డి సమీక్షా సమావేశం
బోనాల ఉత్సవాలపై నిర్వాహకులతో ఏసీపీ నరేష్ రెడ్డి సమావేశం..
కూకట్ పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: బోనాల పండుగ సందర్భంగా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి బోనాల ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పోలీసుల నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ సీఐ ప్రశాంత్, డిఐ సక్రం, ఎస్సైలు, బోనాల ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు..