Medchal: చంద్రపురి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం!

Medchal: కీసర సర్కిల్ చంద్రపురి కాలనీలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్, యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2026-08-08 10:22 GMT

Medchal: చంద్రపురి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం!

Medchal: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు,మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జవహర్‌నగర్ మాజీ ఎంపీటీసీ పరశురాం ,బిఆర్ఎస్ వి అధ్యక్షులు నర్ర మహేష్ , యువజన నాయకులు బబ్లూ ముదిరాజ్, రాహుల్ కదం ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు హాజరై, పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఉచిత విద్యుత్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కుటుంబంలోకి చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్,

రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు ముదిరాజ్, కుతాడి శ్రీకాంత్, కుతాడి సాయికుమార్, జమాల్పూర్ నవీన్ కుమార్ AMC డైరెక్టర్ ఈగ శ్వేత, నాయకులు బల్లి శ్రీనివాస్, కారింగుల రాజు గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, గోనె చిట్టిబాబు, రజిత గోపాల్, విజయ్ రాయ్, గండి సునీత, బొబ్బిలి మంజుల, బూడిద వెంకటేష్, అలివేలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News