Tandur: అదృశ్యమైన గురుకుల విద్యార్థి క్షేమంగా లభ్యం
Tandur: తాండూరు గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి అక్షిత్ మోమిన్‌పేట్ వద్ద క్షేమంగా దొరికాడు. చదువు ఇష్టం లేక స్వయంగా వెళ్లిపోయినట్లు తెలిపాడు.
Tandur: అదృశ్యమైన గురుకుల విద్యార్థి క్షేమంగా లభ్యం
తాండూరు: తాండూరు పట్టణం విజయనగర్ కాలనీలో ఉన్న పెద్దేముల్ మండలం టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న మోమినిపేట మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన అక్షిత్ గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాల నుంచి అదృశ్యం కాగా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఓవైపు పోలీసులు మరోవైపు తల్లిదండ్రులు విద్యార్థి అక్షిత్ ను వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మోమిన్ పేట్ దగ్గరలోని పెట్రోల్ పంపు సమీపంలో గ్రామస్తులు అక్షిత్ ను గుర్తించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు బాబు వద్దకు చేరుకోవడంతో అదృశ్య సంఘటన సుఖాంతంగా ముగిసింది. మంగళవారం విద్యార్థి పాఠశాలలో చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పి పాఠశాల నుండి లగేజీబాక్సు తో వారి స్వస్థలానికి వెళ్లిపోయాడు.
వెళ్ళిపోయే ముందు పాఠశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ...
పాఠశాలలో ఏ విధమైన ఇబ్బంది లేదని,పాఠశాలలో ఉండడం ఇష్టం లేక వెళ్లిపోయానని పదవ తరగతి విద్యార్థి అక్షిత్ తెలిపాడు. ఉపాధ్యాయులు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ తనను ఏ విధంగా ఇబ్బందిలకు గురి చేయలేదని తనకు పాఠశాలలో ఉండడం ఇష్టం లేక వెళ్లిపోయినట్లు తెలిపాడు.
విద్యార్థి తండ్రి మాట్లాడుతూ...
తన కొడుకుకు ఇష్టం లేక పాఠశాల నుండి వెళ్లిపోయాడని అక్షిత్ తనకు తెలపడం జరిగిందన్నాడు. తన కొడుకుకు ఇష్టం లేని చదువులు చదివించి తాను ఇబ్బంది పడడం కంటే తన కొడుకుకు ఇష్టమేనా చోటనే చదివిస్తానన్నాడు.