Gachibowli: కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్‌ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు
Gachibowli: గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి 'కాంగ్రెస్ బాకీ కార్డు' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Gachibowli: కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్‌ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు
గచ్చిబౌలి: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీలను విస్మరించి 1000 రోజుల విఫల పాలన సాగిస్తోందని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖాజాగూడలోని గచ్చిబౌలి BRS పార్టీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, నెరవేర్చని హామీలను వివరిస్తూ రూపొందించిన *"కాంగ్రెస్ బాకీ కార్డు"* గోడపత్రికను (పోస్టర్) నాయకులు ఆవిష్కరించారు.
అనంతరం కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాబోయే 10 రోజుల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.