Malkajgiri: విషాదంలో ఉన్న కుటుంబాలను పరామర్శించిన మైనంపల్లి

Malkajgiri: మల్కాజిగిరిలో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు అవుసుల శ్రీధర్ తండ్రి, సతీష్ యాదవ్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు.

Update: 2026-09-01 11:31 GMT

Malkajgiri: విషాదంలో ఉన్న కుటుంబాలను పరామర్శించిన మైనంపల్లి

మల్కాజిగిరి: మల్కాజిగిరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుసుల శ్రీధర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో,మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అదేవిధంగా యాతం నగేష్ యాదవ్ కుమారుడు సతీష్ యాదవ్ ఇటీవల హఠాన్మరణం చెందడంతో,మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.సతీష్ యాదవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,వెంకటేష్ యాదవ్,బి కే శ్రీనివాస్, మురుగేష్,సంపత్ గౌడ్, వినోద్ యాదవ్,ప్రవీణ్, ఎస్ అర్ ప్రసాద్,జి ఎన్ వి సతీష్,సత్యనారాయణ,బాబు, పార్థసారధి,నరేష్, సంతోష్ రాందాస్, ప్రసాద్ యాదవ్,రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News