Kukatpally: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

Kukatpally: కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ లారీ ఢీకొని యూసఫ్ మృతి, డ్రైవర్ పరారీ కేసు నమోదు చేసిన పోలీసులు.

Update: 2026-08-20 04:57 GMT

Kukatpally: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

Kukatpally: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌ బస్‌స్టాప్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో యూసఫ్‌ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రశాంత్‌నగర్‌ బస్‌స్టాప్‌ వద్ద యూసఫ్‌ను టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యూసఫ్‌, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు.

ప్రమాదం అనంతరం టిప్పర్‌ డ్రైవర్‌ వాహనంతో సహా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News