Nacharam: నాచారం ఉర్బేన్ నానో కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

Nacharam: నాచారం ఉర్బేన్ నానో కాలేజీలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవగాహన సదస్సు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలపై విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక.

Update: 2026-08-19 14:43 GMT

Nacharam: నాచారం ఉర్బేన్ నానో కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

నాచారం: నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉర్బేన్‌ నానో కాలేజీలో సైబర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ మైబెల్లీ, సైబర్‌ క్రైమ్‌ మల్కాజ్‌గిరి ఎస్‌ఐ శ్రీనివాస్‌, సైబర్‌ వారియర్‌ అనిల్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటీపీ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌లు, హానికరమైన ఏపీకే లింకులు, మ్యాట్రిమోనియల్‌ మోసాలు, సెక్స్టార్షన్‌, ఆన్‌లైన్‌ ఉద్యోగ మోసాలు, లక్కీ డ్రా స్కామ్‌లు, లోన్‌ యాప్‌ మోసాలు, పెట్టుబడి మోసాలపై అవగాహన కల్పించారు.

ఆన్‌లైన్‌ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్‌ చేయవద్దని, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని పోలీసులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్‌, బోధనా సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News