Hyderabad: జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పక్కా స్కెచ్: వరుస ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్

Hyderabad: వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్థులతో పాటు రిసీవర్‌ను జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-08-06 17:28 GMT

Hyderabad: జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పక్కా స్కెచ్: వరుస ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్

హైదరాబాద్: వివిధ కమిషనరేట్ల పరిధిలో వరుసగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా నేరస్థులతో పాటు ఒక చోరీ సొత్తు గ్రహీతను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 12,00,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలు మరియు పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటన వివరాలు: పోలీసు కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు దేరంగుల హరిబాబు అలియాస్ నాని గత జూన్ 2026లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన్నీరు సూర్య, నరాల రాహుల్‌లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి మళ్లీ వరుస ఇళ్ల దొంగతనాలకు తెరలేపాడు. నిందితుడు హరిబాబుపై గతంలో 27 కేసులు, సూర్యపై 13 కేసులు, రాహుల్‌పై 3 కేసులు నమోదు కాగా, వీరిపై పాత నేర చరిత్ర ఉంది.

ఈ ముఠా ఇటీవల గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 11 నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

అరెస్టయిన నిందితుల వివరాలు:

1. దేరంగుల హరిబాబు అలియాస్ నాని (21), నిరుద్యోగి, నివాసం: దయానందం కాలనీ, సూరారం, హైదరాబాద్.

2. తన్నీరు సూర్య అలియాస్ సూరి (22), నిరుద్యోగి, నివాసం: సంతోష్ నగర్, సూరారం, హైదరాబాద్.

3. నరాల రాహుల్ (21), ఇన్వర్టర్ టెక్నీషియన్, నివాసం: మమత నగర్ కాలనీ, నాగోల్, హైదరాబాద్.

సొత్తు గ్రహీత (రిసీవర్):

• సబావత్ రవి (27), ఆటో డ్రైవర్, నివాసం: ఆర్‌టీసీ కాలనీ, మౌలాలీ, హైదరాబాద్.

స్వాధీనం చేసుకున్న సొత్తు (విలువ ₹12,00,000/-):

• 80 గ్రాముల బంగారం

• 258 గ్రాముల వెండి (4 జతల పట్టీలు, 1 కుంకుమ భరిణె)

• 04 మొబైల్ ఫోన్లు

• 02 ద్విచక్ర వాహనాలు

• నేరానికి ఉపయోగించిన ఐరన్ రాడ్ (01), స్క్రూ డ్రైవర్ (01)

నమోదైన కేసులు: నిందితులు గౌరారం (Cr. No. 117/2026), సంగారెడ్డి టౌన్ (Cr. No. 270/2026), పోచారం ఐటీ కారిడార్ (Cr. No. 390/2026, 393/2026), నాగోల్ (Cr. No. 480/2026), కుషాయిగూడ (Cr. No. 557/2026), మేడిపల్లి (Cr. No. 1038/2026), వనస్థలిపురం (Cr. No. 1401/2026) మరియు సూరారం (Cr. No. 666/2025, 704/2025, 706/2025) పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యాదేందర్, జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ డి. రవి రాజ్ మరియు వారి సిబ్బంది అత్యంత ప్రతిభావంతంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారని కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపిఎస్ తెలిపారు.

జారీ చేసిన వారు- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపిఎస్ , డిసిపి, కమిషనర్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాదు.

Tags:    

Similar News