రెండో రోజూ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. సమాధానాలు దాటవేతపై సీపీ ఆగ్రహం!
Uday Krishna Reddy: అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరింది.
రెండో రోజూ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. సమాధానాలు దాటవేతపై సీపీ ఆగ్రహం!
Uday Krishna Reddy: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసు కస్టడీ విచారణ రెండో రోజుకు చేరుకుంది. హైదరాబాద్ నగర సీపీ విసి సజ్జనార్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారిస్తోంది.
బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో పరిచయం ఏర్పడిన నాటి నుంచి జరిగిన పరిణామాలు, నేరానికి ఉపయోగించిన కత్తి ఎక్కడుంది?, కేసులో కీలక ఆధారాలు ఉన్న ఐఫోన్‌ను ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? అనే ప్రధానాంశాలపై అధికారులు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. గతంలో మరో మహిళను కూడా వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తుండటం, ఆధారాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల దాచివేతలో ప్రమేయం ఉందనే అనుమానంతో ఉదయ్ మేనమామ, తమ్ముడిని కూడా దర్యాప్తు బృందం ఇప్పటికే ప్రశ్నించింది. నేటి కస్టడీ గడువు ముగిసిన అనంతరం సేకరించిన కీలక వివరాలతో నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.