Hafeezpet: ఫీజ్‌పేట్‌లో తెలంగాణ 'చిన్నమ్మ' సుష్మా స్వరాజ్ వర్ధంతి!

Hafeezpet: హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో సుష్మా స్వరాజ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2026-08-06 11:53 GMT

Hafeezpet: ఫీజ్‌పేట్‌లో తెలంగాణ 'చిన్నమ్మ' సుష్మా స్వరాజ్ వర్ధంతి!

హాఫీజ్పేట్: బీజేపీ జాతీయ సీనియర్ నాయకురాలు , మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి , తెలంగాణ చిన్నమ్మ , సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసం చావకండి తెలంగాణ చూడడం కోసం బ్రతకండి అని ఒక తల్లిగా, బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలిగా, స్వరాష్ట్రం కోసం చనిపోతున్న తెలంగాణ విద్యార్థి కిశోరాలకు ధైర్యం కల్పించే విధంగా భరోసా ఇచ్చిన తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, బీజేపీ సీనియర్ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రవి గౌడ్ , జిల్లా బీజేపీ కౌన్సిలర్ మెంబర్ ఆళ్ల వరప్రసాద్, బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , కాలనీ వాసులు రామారావు ,బీజేపీ నాయకులు, శేఖర్ ముదిరాజ్ , అశోక్ ముదిరాజ్ , రామ్ రెడ్డి , శ్రీకాంత్ , లోకేష్ , నరేష్ , విజయ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News