LB Nagar: పెండింగ్ బిల్లుల ఒత్తిడే శ్రీనివాస్ రెడ్డి ప్రాణం తీసింది!
LB Nagar: వనస్థలిపురంలో దివంగత సివిల్ కాంట్రాక్టర్ బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
LB Nagar: పెండింగ్ బిల్లుల ఒత్తిడే శ్రీనివాస్ రెడ్డి ప్రాణం తీసింది!
LB Nagar: వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్న దివంగత సివిల్ కాంట్రాక్టర్ బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపుల్లో ఎదురైన తీవ్ర ఒత్తిడే శ్రీనివాస్ రెడ్డి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.5.5 కోట్ల బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండగా, వాటిని ప్రస్తుతం విడుదల చేయించినట్లు వెల్లడించారు.శ్రీనివాస్ రెడ్డి మంచి నాయకుడిగా, నిబద్ధత కలిగిన కాంట్రాక్టర్‌గా ఎంతోమందికి ఉపాధి కల్పించారని మంత్రి కొనియాడారు. ఆయనకు చెందిన క్రషర్ మిషన్‌పై రూ.54 కోట్ల బకాయిల ఒత్తిడి కూడా తీవ్ర మానసిక వేదనకు కారణమైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మైన్స్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద, సబ్ కాంట్రాక్టర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు.