Hyderabad: భారత్‌లోకి 'జర్మన్ డోనర్ కబాబ్' హైదరాబాద్‌లో తొలి ఔట్‌లెట్!
Hyderabad: అంతర్జాతీయ బ్రాండ్ 'జర్మన్ డోనర్ కబాబ్' భారత్‌లోకి ప్రవేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో తొలి ఔట్‌లెట్ ప్రారంభం, 450 స్టోర్లే లక్ష్యం.
Hyderabad: భారత్‌లోకి 'జర్మన్ డోనర్ కబాబ్' హైదరాబాద్‌లో తొలి ఔట్‌లెట్!
Hyderabad: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీమియం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్ జర్మన్ డోనర్ కబాబ్ భారత్లోకి అధికారికంగా ప్రవేశించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో దేశంలోనే తొలి ఔట్లెట్ను ప్రారంభించింది. భారత్లో మాస్టర్ ఫ్రాంచైజీ భాగస్వామిగా జీబీసీ ఇండియా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన కార్యకలాపాలను దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది.
దీర్ఘకాలంలో భారత్లో 450కి పైగా రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ఔట్లెట్లతో పాటు ఫ్రాంచైజీ విధానంలోనూ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. భారత్లో కేవలం రెస్టారెంట్ చైన్ ను ఏర్పాటు చేయడం కాకుండా డోనర్ ఫుడ్ కేటగిరీని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని జర్మన్ డోనర్ కబాబ్ ఇండియా సీఈఓ విక్రాంత్ తోమర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డోనర్ అనుభవాన్ని భారతీయ వినియోగదారులకు అందించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్లో తొలి ఔట్లెట్ అనంతరం మొహాలి, చండీగడ్తో పాటు ఇతర టియర్-1, టియర్-2 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. రుచి, తాజాదనం, నాణ్యతతో పాటు ప్రోటీన్ ఆధారిత ఆహార ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారత్లో యువతను ఆకట్టుకునేలా సంగీతం, ఫ్యాషన్, క్రీడలు, ఫిట్నెస్, వినోదంతో బ్రాండ్ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ప్రముఖ సంగీత కళాకారుడు, నటుడు, దర్శకుడు పర్మిష్ వర్మను సాంస్కృతిక భాగస్వామిగా నియమించుకున్నట్లు వెల్లడించింది.