Hyderabad: దోమల నివారణకు చర్యలు చేపట్టాలి: ఆంజనేయులు సాగర్!

Hyderabad: అంజయ్య నగర్ డివిజన్ బస్తీలలో దోమల బెడద నివారించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ప్రజావాణిలో జీహెచ్‌ఎంసీ అధికారులకు నాయకుడు ఆంజనేయులు సాగర్ వినతిపత్రం అందజేశారు.

Update: 2026-08-17 17:11 GMT

Hyderabad: దోమల నివారణకు చర్యలు చేపట్టాలి: ఆంజనేయులు సాగర్!

హైదరాబాద్: అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, పీజేఆర్ నగర్, రాజీవ్ నగర్,గుల్షన్ నగర్ బస్తీలలో వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీలలో నీరు నిలిచిపోవడంతో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నందున, సంబంధిత ఎంటమాలజీ విభాగం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమస్యపై అంజయ్య నగర్ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ గారు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని బస్తీలలో దోమల నివారణకు స్ప్రేయింగ్ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీను,వెంకటేష్, మల్లేష్,రోహిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News